YCP leaders attack on TDP activist : అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం అచ్యుతాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రామనాథ్ రెడ్డిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. తాడిపత్రికి చెందిన రామనాథ్ రెడ్డి అచ్యుతాపురంలో శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ కాపు కాసిన కొంతమంది వైసీపీ నాయకులు.. రామనాథ్ రెడ్డితో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వైసీపీ నాయకులు రామనాథ్ రెడ్డిపై తీవ్రంగా దాడి చేశారు.
టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి - అనంతపురంలో వైసీపీ నేతల దాడి
YYCP leaders attack on TDP activist : అతను ఓ శుభకార్యానికి వెళ్లాడు. ఎన్నాళ్లనుంచో వేచి చూస్తున్న ప్రత్యర్థులు అక్కడ కాపు కాశారు. కావాలని అతనితో గొడవ పెట్టుకున్నారు. మాటామాటా పెరిగి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా అచ్యుతాపురంలో జరిగింది.
దాడి
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను చెదరగొట్టారు. అనంతరం గాయాలైన రామనాథ్ రెడ్డిని తాడిపత్రి ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: