కౌలు భూమి తగాదాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై.. వైకాపా నాయకులు దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పరిగి మండల కేంద్రంలో జయరామప్ప అనే వ్యక్తిపై వైకాపా నాయకులు అన్యాయంగా దాడికి పాల్పడ్డారని బాధితుడి బంధువులు తెలిపారు.
కౌలు భూమి తగాదా.. తెదేపా కార్యకర్తపై దాడి
కౌలు భూమి విషయంలో తెలుగు దేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తపై.. వైకాపా నాయకులు దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
వ్యక్తిపై దాడి
జయరామప్పకు వైకాపా నాయకులకు గతం నుంచి కౌలు భూమి విషయంలో గొడవలు ఉన్నాయని, ఆ కారణంగా ఈరోజు ఘర్షణ జరిగినట్టు పరిగి మండల పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జయరామప్ప హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పరిగి మండలం పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:suicide: రాత్రి ఇంటికి రాలేదని తండ్రి మందలించాడని..