వైకాపాకు ప్రజల్లో విశేష ఆదరణ ఉందని అనంతపురం పార్లమెంటు వైకాపా ఇన్ఛార్జి ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. చెప్పారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం సీట్లు, ఓట్లు తమ పార్టీ మద్దతుదారులకే దక్కాయని అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుతో సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. ఆ నమ్మకంతోనే పంచాయతీ ఎన్నికల్లో విజయం కట్టబెట్టారని అన్నారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ తరహా ఫలితాలే పునరావృతం అవుతాయని వెల్లడించారు.