ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అనంతపురంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉంటే.. చంద్రబాబు బురదజల్లే రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక్కడ వరదల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడటం లేదని, ఆ విషయాన్ని గమనించాలని చెప్పారు, ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లకముందే ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులతో అన్ని విధాలుగా చర్చించి ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్నా... ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, తగు సూచనలిస్తున్నారని చెప్పారు.
"సీఎంపై చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదం" - malladi vishnu
సీఎంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వరదలను అనునిత్యం జగన్ తెలుసుకుంటున్నారని చెప్పారు.
'40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన మాటలు హాస్యాస్పదం'