వైకాపా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడాలంటే ఎలాంటి నాయకుడైనా భయపడాలని తాడిపత్రి వైకాపా నేత కందిగోగుల మురళీ ప్రసాద్ అన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జేసీ కుటుంబంపై వంద కోట్ల జరిమానా విధించటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన ఆయన.... జేసీ కుటుంబం వంద కోట్ల అవినీతి కాదని వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వంలోనూ వారి అవినీతిపై నివేదిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జేసీ కుటుంబం అవినీతి అక్రమాలను బయటపెట్టినందుకు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. తనకి ఏమైనా జరిగితే జేసీ కుటుంబమే బాధ్యత వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'జేసీపై చర్యలు ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం' - జేసీ దివాకర్ రెడ్డిపై వందకోట్ల జరిమానా
జేసీ దివాకర్ రెడ్డిపై వంద కోట్ల జరిమానా విధించటాన్ని వైకాపా నేత కందిగోగుల మురళీప్రసాద్ స్వాగతించారు. గత ప్రభుత్వంలో జేసీ కుటుంబంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. జేసీ కుటుంబం అక్రమాలను బయటిపెట్టినందుకు బెదిరించారని అన్నారు. తనకి ఏమైనా జరిగితే జేసీ కుటుంబమే బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
slapped hundred crore fine