ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS Viveka Murder Case update: "వైఎస్​ వివేకా హత్య కేసులో.. నన్ను సీబీఐ బెదిరిస్తోంది" - viveka murder case news

వైఎస్‌ వివేకా హత్య(viveka murder case latest news) కేసులో తనను సీబీఐ అధికారి బెదిరిస్తున్నారని.. అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్‌ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను కలిసి ఫిర్యాదు చేశారు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Viveka Murder Case
Viveka Murder Case

By

Published : Nov 29, 2021, 5:16 PM IST

Updated : Nov 29, 2021, 5:58 PM IST

వివేకా హత్యకు వారే కారణమంటూ తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ బెదిరిస్తోంది

YS Viveka Murder Case update: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు.. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డి కారణమని వాంగ్మూలం ఇవ్వాలని (gangadhar reddy complaint to sp over viveka murder case) సీబీఐ అధికారి ఒత్తిడి చేస్తున్నారని కల్లూరు గంగాధర్ రెడ్డి అనేక వ్యక్తి ఆరోపించారు. అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన వైకాపా నేతగా ఉన్న గంగాధర్ రెడ్డి.. ఎస్పీ ఫక్కీరప్పను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

వివేకాను హత్యచేయటానికి శివశంకర్ రెడ్డి తనకు పది కోట్లు ఇవ్వజుపగా.. తాను నిరాకరించినట్టు వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్​సింగ్ బెదిరించారని గంగాధర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు.. తనకు సీబీఐ అధికారులు, సీఐ శ్రీరామ్, వివేకా అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. అందువల్ల తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరినట్టు గంగాధర్ రెడ్డి చెప్పారు.

ఈనెల 24న తనకు నోటీసు ఇచ్చారని, 25న తాను సీబీఐ విచారణకు వెళ్లగా.. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారని ఆరోపించారు. వాంగ్మూలం ఇచ్చిందేకు తాను నిరాకరించినట్లు గంగాధర్ రెడ్డి తెలిపారు. జిల్లాకు చెందిన సీఐ శ్రీరామ్ తప్పుడు సాక్ష్యం చెప్పాలని వాట్సాప్ కాల్ ద్వారా బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గంగాధర్‌ ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి సంచలన వాంగ్మూలం (ఆయన మాటల్లోనే..)

  • 'వై.ఎస్‌.వివేకాను చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు... మేమూ నీతో వస్తాం. దీని వెనుక వైఎస్‌.అవినాశ్ రెడ్డి, వైఎస్‌.మనోహర్‌ రెడ్డి, వైఎస్‌.భాస్కర్‌ రెడ్డి. డి.శివశంకర్‌ రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు' అని ఎర్ర గంగి రెడ్డి నాతో చెప్పారు.
  • 'వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి మనకు రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తా' అని ఎర్ర గంగిరెడ్డి నాతో అన్నారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వై.ఎస్‌.వివేకా ఓ రోజు అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడున్న శివశంకర్‌రెడ్డిని చూసి 'నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు. నన్ను నా కుటుంబసభ్యులకు దూరం చేశావు. నీ అంతు చూస్తా' అని హెచ్చరించారు. తర్వాత అవినాశ్ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డిలను చూస్తూ 'మీ అందరి కథ చెబుతా' అంటూ కేకలేశారు.
  • శివశంకర్‌ రెడ్డితో పాటు వై.ఎస్‌.భాస్కర్‌ రెడ్డి, వై.ఎస్‌.అవినాశ్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సరిగ్గా మద్దతివ్వని కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారు.
  • వివేకా హత్య జరిగిన తర్వాత రోజు ఉదయం 5 గంటలకు ఎర్ర గంగిరెడ్డి నన్ను ఆయన ఇంటికి పిలిపించారు. 'మీరేం భయపడొద్దు. నేను శివశంకర్‌ రెడ్డి, వై.ఎస్‌.అవినాశ్ రెడ్డితో మాట్లాడాను. వాళ్లు అంతా చూసుకుంటామన్నారు. నీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తా' అని నాతో చెప్పారు.
  • ఈ ఏడాది మార్చి 3న దిల్లీకి రావాలంటూ సీబీఐ అప్పట్లో నాకు నోటీసులు ఇచ్చింది. దీంతో డి.శివశంకర్‌ రెడ్డి, విద్యా రెడ్డి, భయపు రెడ్డి నన్ను పిలిచారు. వారి పేర్లు ఎక్కడా చెప్పొద్దని నాకు డబ్బులు ఇస్తామన్నారు. నా జీవితం సెటిల్‌ చేసేస్తామన్నారు. తర్వాత దిల్లీలో నా వద్దకు భరత్‌ యాదవ్‌ను పంపించారు. అక్కడ జరిగే విషయాలన్నీ శివశంకర్‌రెడ్డికి తెలియజేయమనేవారు.

ఇదీ చదవండి

Viveka Murder Case: సీబీఐ కస్టడీకి వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌ రెడ్డి

Last Updated : Nov 29, 2021, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details