ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో మహిళా వాలంటీర్​పై వైకాపా నాయకురాలు దాడి - అనంతపురంలో మహిళా వాలంటీర్​పై దాడి

అనంతపురంలోని రాజీవ్ కాలనీలో వైకాపా నాయకురాలు హజరాబి.. మహిళా వాలంటీర్​పై దాడికి పాల్పడ్డారు. తనకు రావాల్సిన భూమి పట్టా మహిళా వాలంటీర్​ తీసుకుందన్న కారణంతో ఈ ఘటనకు పాల్పడింది. బాధితురాలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్​లో సచివాలయ సిబ్బందితో కలిసి ఫిర్యాదు చేశారు.

ycp leaders attack on woman voluntary
అనంతపురంలో మహిళా వాలంటీర్​పై వైకాపా నాయుకురాలు దాడి

By

Published : Dec 28, 2020, 4:51 PM IST

Updated : Dec 28, 2020, 9:23 PM IST

''నేను వైసీపీ నాయకురాలు.. నాకు రెండు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి'' అంటూ హజరాబి అనే మహిళా అనంతపురంలోని రాజీవ్ కాలనీ సచివాలయం వద్ద హల్​చల్ చేశారు. బంధువులతో కలిసి మహిళా వాలంటీర్ అనురాధ​పై దాడికి పాల్పడింది. ఈ మేరకు స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్​లో సచివాలయ సిబ్బందితో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారు.

'ఆదివారం స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. ఆ సమయంలో తనకు వచ్చిన పట్టా తీసుకోకుండా రెండు పట్టాలు కావాలంటూ వైకాపా నాయకురాలు హజరాబి బెదిరించింది. పంపిణీలో భాగంగా నాకు వచ్చిన పట్టాను నేను తీసుకున్నా. అయితే ఆమె ఇంటి స్థలం పట్టా తాను తీసుకున్నానన్న నెపంతో కోపం పెంచుకున్న హజరాబి..దాడి చేసింది' అని వాలంటీర్ అనురాధ పేర్కొన్నారు.

అనంతపురంలో మహిళా వాలంటీర్​పై వైకాపా నాయకురాలు దాడి

హజరాబి తన బంధువులతో ఇంటిపైకి వచ్చి దాడి చేసిందని బాధితురాలు వాపోయింది. సచివాలయ సిబ్బందిని ఆమె నిత్యం బెదిరిస్తూ.. వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్​

Last Updated : Dec 28, 2020, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details