ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YCP Internal Clashes: మంత్రికి సొంత పార్టీ నేత సవాల్.. నియోజకవర్గంలో హైటెన్షన్ ! - అనంత వైకాపాలో ముదురుతున్న గొడవలు

అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో అధికార వైకాపాలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మంత్రి శంకర నారాయణ ప్రమాణం చేయాలంటూ వైకాపా నేత రమణారెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సవాల్​ను స్వీకరించిన గోరంట్ల వైకాపా నాయకులు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రమాణం చేయటానికి బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు.

మంత్రికి సొంత పార్టీ నేత సవాల్
మంత్రికి సొంత పార్టీ నేత సవాల్

By

Published : Oct 19, 2021, 9:49 PM IST

Updated : Oct 20, 2021, 12:29 AM IST

అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో అధికార వైకాపాలో వర్గ విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. మంత్రి శంకర​ నారాయణ, వైకాపా నాయకుడు గంపల రమణారెడ్డిల మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మంత్రి ప్రమాణం చేయాలంటూ రమణారెడ్డి విసిరిన సవాల్​ను స్వీకరించిన గోరంట్ల వైకాపా నాయకులు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రమాణం చేయటానికి బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లటానికి అనుమతి లేదని పోలీసులు చెప్పటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా...అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న ఘర్షణ ఎక్కడికి దారి తీస్తుందోనని నియోజకర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఏం జరిగిందంటే..

మంత్రి శంకరనారాయణ నిజాయితీపరుడని ఆలయంలో ప్రమాణం చేసి చెబుతారా అని గోరంట్ల మండలం కరావులపల్లికి చెందిన సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, వైకాపా నాయకుడు గంపల వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఇటీవల మంత్రి విలేకరుల సమావేశంలో సొంత పార్టీలో కొంతమంది నాయకులను పందికొక్కులతో పోల్చారు. ఈ నేపథ్యంలో సోమవారం గంపల వెంకటరమణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. గోరంట్లలో లేఔట్లు వేసిన వారి నుంచి డబ్బు వసూలు, గోరంట్ల పంచాయితీకి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల నష్టం వాటిల్లడానికి మంత్రి, ఆయన సోదరులు కారణం కాదా ? అని ప్రశ్నించారు. తెదేపా నాయకులతో కుమ్మక్కై వారికి పనులు ఇవ్వలేదా అని నిలదీశారు. కేసు పెడతామని భయపెట్టి కియా పరిశ్రమ పక్కన 200 ఎకరాలు అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

ఇదీ చదవండి

FIRE : పంట కుప్పకు నిప్పు...కన్నీరు మున్నీరైన రైతు...ఏం జరిగింది ?

Last Updated : Oct 20, 2021, 12:29 AM IST

ABOUT THE AUTHOR

...view details