'తెదేపా కార్యకర్త పై వైకాపా వర్గీయుల దాడి - tdp
ధర్మవరం నేలకోటకు చెందిన తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. బస్సు కోసం ఎదురు చూస్తుండగా నేలకోటకు చెందిన ఇద్దరు వ్యక్తులు కుర్చీతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.
'తెదేపా కార్యకర్త పై వైకాపా వర్గీయుల దాడి-తలకు తీవ్ర గాయాలు'
అనంతపురం జిల్లా ధర్మవరం నేలకోట తండాకు చెందిన రాజు నాయక్ అనే తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ధర్మవరం దుర్గమ్మ ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉన్న నాయక్ పై రవి నాయక్, వెంకటేష్ నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఇనుప కుర్చీ తో రాజు నాయక్ పై దాడి చేయగా తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.