ATTACK ON TDP LEADER JC ASMITH REDDY : అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. తాడిపత్రిలోని మూడోవార్డులో పర్యటిస్తుండగా.. అకస్మాత్తుగా అస్మిత్‌పై రాళ్ల దాడి జరిగింది. వీధిలైట్లు ఆపి మరీ వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో ఇద్దరికి గాయాలు కాగా, అస్మిత్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. గత మూడు రోజుల నుంచి తాడిపత్రిలోని పలువార్డుల్లో అస్మిత్ పర్యటిస్తున్నారు.
మండిపడ్డ జేసీ ప్రభాకర్‌రెడ్డి: అస్మిత్‌రెడ్డిపై జరిగిన రాళ్లదాడిని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఘటనాస్థలానికి వెళ్లిన జేసీ.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తుండగానే పోలీసులు వెళ్లిపోయారని ఆరోపించారు.