ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుకొండను జిల్లాగా ప్రకటించాలని సీఎంకు లేఖలు - అనంతపురం జిల్లా ఈరోజు తాజా వార్తలు

పెనుకొండను నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించాలని.. పెనుగొండ జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ సభ్యులు సీఎం జగన్​కు లేఖలు రాశారు. ఆర్టీసీ డిపో కార్మికులతో కలిసి పెనుగొండను నూతన జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు.

write Letters to the CM jagan
సీఎంకు లేఖలు రాసిన పెనుగొండ జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు,

By

Published : Mar 26, 2021, 3:24 PM IST

అనంతపురం జిల్లాలోని పెనుకొండను నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ.. పెనుకొండ జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ ఆధ్వర్యంలో పెనుకొండ ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న పెనుకొండను.. నూతన జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు. అనంతరం కార్మికులు లేఖలు రాసి సీఎంకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details