కోస్తా జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో వరదలతో జనం ఇబ్బందులుపడుతుంటే.. రాయలసీమలో మాత్రం వరుణుడి జాడ కోసం ప్రజలు పూజలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో వర్షాల కోసం గాడిదలకు పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా గాడిదలను గ్రామంలో ఊరేగించారు. ఉరవకొండ ప్రాంతంలో నెలన్నరగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. గాడిదలకు పూజలు చేసి ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయని స్థానికుల విశ్వాసం. నెరిమెట్లలో బొడ్రాయికి 108 బిందెలతో జలాభిషేకం చేశారు. బెలుగుప్ప రామేశ్వర ఆలయంలో వర్షం కోసం సప్త భజనలు నిర్వహించగా... తట్రకల్లులో రుద్రాభిషేకం చేశారు.
వరుణుడి జాడ కోసం గాడిదలకు పూజలు.. ఘనంగా ఊరేగింపు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ఓ వింత ఆచారాలు కొనసాగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ.. అక్కడి ప్రజలు గాడిదలకు పూజలు చేసి ఘనంగా ఊరేగించారు.
వరుణుడి జాడ కోసం గాడిదకు పూజలు