ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంబులపూలకుంట సౌరవిద్యుత్ ప్రాజెక్టు వద్ద కార్మికుల ఆందోళన - News of solar project workers protesting to pay salaries

తమకు ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు అందడం లేదని అనంతపురం జిల్లా నంబులపూలకుంట సౌరవిద్యుత్ ప్రాజెక్టు వద్ద దానిలో పని చేస్తున్న కూలీలు ఆందోళన చేపట్టారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు స్పష్టం చేశారు.

నంబులపూలకుంట సౌరవిద్యుత్ ప్రాజెక్టు వద్ద సోలార్ కార్మికుల ఆందోళన
నంబులపూలకుంట సౌరవిద్యుత్ ప్రాజెక్టు వద్ద సోలార్ కార్మికుల ఆందోళన

By

Published : Aug 12, 2020, 1:35 PM IST

కొన్ని నెలలుగా జీతాలు అందడంలేదంటూ అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో సోలార్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కూలీలలు సౌరవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టారు. ఏఐటూయూసీ నాయకులు వారికి మద్దతు తెలిపారు. అధికారపార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలతో చాలా మంది కార్మికులను తొలగిస్తున్నారన్నారు. కార్మికులకు ఫిబ్రవరి నుంచి వేతనాలు అందడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తూ సోలార్ ప్రాజెక్టు నిర్వహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతనాలు చెల్లించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు స్పష్టం చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details