..
మడకశిరలో నీళ్లకోసం నిరసన - మడకశిరలో నీళ్లకోసం ఆందోళన
అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు కాలనీవాసులు నీళ్ల కోసం ధర్నా చేశారు. కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కమిషనర్, ఏఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 20 రోజుల నుంచి తాగునీరు రావడం లేదని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. నీటి సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. బోరుకు మరమ్మతు చేయించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
రోడ్డుపై ధర్నా చేస్తున్న మహిళలు