ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి సమస్య పరిష్కరించాలని తలుపులలో మహిళల ధర్నా - womens agaition for water at thalupula

అనంతపురం జిల్లా తలుపులలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. వీరి నిరసనతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

womens protest for water at thalupula in anantapur district
రోడ్డపై బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు

By

Published : Mar 19, 2020, 1:57 PM IST

తాగునీటి సమస్య పరిష్కరించాలని రహదారిపై మహిళల ఆందోళన

అనంతపురం జిల్లా తలుపులలో ప్రధాన రహదారిపై మహిళలు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రకాష్ నగర్, కుమ్మరి పేట, బలిజిపేట ప్రాంతాలకు చెందిన మహిళలు సమస్య పరిష్కరించాలని నీళ్ల బిందెలతో రహదారిపై బైఠాయించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించట్లేదని మహిళలు వాపోయారు. ట్యాంకర్ల ద్వారా సరిపడా నీటిని అందించాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ABOUT THE AUTHOR

...view details