అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరు గ్రామంలో ప్రజలు మూడు రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా మహిళలు ఖాళీ బిందెలతో మడకశిర - పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 3 తాగునీటి బోరుబావులు ఉండగా... ఒక దానిలో పూర్తిగా నీరు అడుగంటిందని స్థానికులు తెలిపారు. మిగిలిన రెండింటిలోనూ అరకొరగా నీరు వస్తుండటం వల్ల గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడింది. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తాగునీటి కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు - drinking water problem at cherukuru in Anantapur
తాగునీటి కోసం అనంతపురం జిల్లా చెరుకూరులో మహిళలు బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. మూడు రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని.. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాగునీటి కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు