ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ కార్యాలయాన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చొద్దు' - womens protest in ananthpuram

మహిళా సాధికారత కార్యాలయాన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చవద్దంటూ... మహిళలు ఆ కార్యాలయం ముందు భీష్మించుకుని కూర్చున్నారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

womens protest in ananthapuram
మహిళా సాధికారత కార్యాలయాన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చవద్దంటూ మహిళలు ధర్నా

By

Published : May 31, 2020, 12:31 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం కే.గుండుమలలో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు గ్రామంలో ఉన్న చంద్రన్న భవన్ మహిళా సాధికారిత కార్యాలయాన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న మహిళలు అధికారులను అడ్డుకున్నారు. ఈ కార్యాలయాన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చరాదని నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలతో అధికారులు చర్చలు జరుపుతున్నా...ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల కార్యాలయం ముందే మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే తాము ఉద్ధృతంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details