తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..ఖాళీ బిందెలతో ధర్నా - water problems
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. దీంతో పత్తికొండ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సమస్య పరిష్కరానికి అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

కృష్ణ, తుంగభద్ర జలాలు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి నెలరోజులు అవుతున్నా ప్రజల నీటి అవసరాలు మాత్రం తీరడం లేదు. తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని 24వ వార్డులో నెల రోజులుగా తాగునీరు సరఫరా చేయడం లేదంటూ.... పెద్ద సంఖ్యలో మహిళలు పత్తికొండ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున రాకపోకలు స్తంభించాయి. మాట్లాడేందుకు వచ్చిన అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.