ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Women Complain to Judge on Drinking Water Problem తాగునీటి సమస్యపై జడ్జికి ఫిర్యాదు.. అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళల వినతి - Complaint to judge on water problem in Anantapur

Womens Complain to Judge About Drinking Water Problem: తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ.. మహిళలు కోర్టులో న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని.. వారిపై చర్యలు తీసుకొని సక్రమంగా తాగు నీటిని సరఫరా చేయాలని కోరారు.

womens_complain_to_judge
womens_complain_to_judge

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 7:28 PM IST

Womens Complain to Judge About Drinking Water Problem:రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటున్నారంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్‌ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు కాని వాస్థవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం ప్రజల దాహార్తిని తీర్చలేకపోతుంది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పిన జగన్‌ సామాన్యులకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేత పోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా గ్రామాల ప్రజలు దాహార్తితో బాధపడుతున్నారు.

Lack of Facilities in Autonagar: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్నా.. కనీస వసతులకు నోచుకోక అల్లాడుతున్న ఆటోనగర్‌

ఉరవకొండ కోర్టులో జడ్జికి ఫిర్యాదు..అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పాతపేట మహిళలు తాగునీటి సమస్యలపై ఆధికారులు పట్టించుకోవడం లేదంటూ ఉరవకొండ కోర్టులో జడ్జికి ఫిర్యాదు చేశారు. పాతపేటలో తాగునీరు 8 రోజులైనా కూడా రావడం లేదని, వచ్చిన అవి కలుషితం అవుతున్న తాగునీటిని సరఫరా చేస్తున్నారని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పైపు లైన్ వేశారని,కానీ కనెక్షన్ ఇవ్వలేదని కోర్టు జడ్జి మేడమ్​కు ఫిర్యాదు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోని ఉరవకొండ పాతపేటకు సక్రమంగా తాగు నీటిని సరఫరా చేయాలని కోరారు.

Locals Protest for Water in Palnadu District: 'రోడ్డు వేయలేదు సరే.. నీళ్లు కూడా ఇవ్వకుంటే ఎలా..?' రోడ్డెక్కిన కాలనీ వాసులు.. నిలిచిన వాహనాలు

Water problem in Uravakonda constituency:అనంతపురం జిల్లాలోని గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీరు విడదల చేయక అనేక గ్రామాల్లని ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు.

Women protest on road with empty bins in guthi municipality:ఇటీవల తాగునీటి సమస్యను తీర్చాలంటూ అనంతపురం జిల్లాలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళననిర్వహించారు. గుత్తి మున్సిపాలిటీలో పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని నెలలుగా తాగునీరు రావడం లేదని స్థానికులు ధర్నాకు దిగారు. ఎన్ని నెలలు గడచినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని.. తాగునీటికి కోసం పనులన్ని ఆపుకుని నీళ్లు తెచ్చుకోవల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. అధికారులు వెంటనే స్పందించి.. తమ సమస్యను పరిష్కరించాలని వారు ఆందోళన చేపట్టారు.

Deep Water Crisis In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు..ఒక్కో బావిపై 50వరకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు

Water problem in Sri Sathyasai District:శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం ఎస్.ఎస్. గుండ్ల గ్రామంలో నీటి సమస్య ఏర్పడి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో మహిళలు ఆగ్రహంతో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగునీటి కోసం పొలాల్లోకి వెళ్లి తెచ్చుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న బోరు బావిలో మోటర్లు చెడిపోయినా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details