ఆధార్‌లో తప్పుల సవరణ, ఫోన్ నెంబర్‌తో అటాచ్‌మెంట్ అనంతపురం జిల్లా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో ఆధార్ కేంద్రాల వద్ద దుస్థితి దారుణంగా ఉంది. మహిళలు చేయూత పథకంలో లబ్ధి పొందటానికి ఆధార్ కార్డ్‌కు.. ఫోన్ నంబర్ అనుసంధానం వెంటనే చేసుకోవాలంటూ ప్రచారం జరగటంతో ఆధార్ కేంద్రాల వద్ద మహిళలు తెల్లవారు జామున 4 గంటల నుంచే పోటెత్తుతున్నారు. కరోనా కష్ట కాలంలో ప్రమాదాన్ని విస్మరించి వందలాది మంది గుమికూడుతున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
చేయూత కోసం మహిళల తిప్పలు.. ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు - అనంతపురంలో ఆధార్ కష్టాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఫోన్ నెంబర్‌కు ఆధార్ జత చేయడానికి మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు.
women waiting at aadhar centres