అనంతపురంలో ఓ మహిళ అనుమానాస్పదంగా హత్యకు గురైంది. నగరంలోని అశోక్ నగర్‌కు చెందిన యశోద స్వాతి( 28)కి 11 సంవత్సరాలు క్రితం నగరానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో భార్యా భర్తల మధ్య గొడవలు రావడంతో భర్తను వదిలేసిన స్వాతి.. నగరానికి చెందిన మల్లికార్జున అనే ఆటో డ్రైవర్‌తో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి మల్లికార్జున స్వాతి మధ్య గొడవ తలెత్తి, మల్లికార్జున స్వాతిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు.
అనుమానాస్పదంగా మహిళ మృతి - అనంతపురంలో మహిళ మృతి
అనంతపురంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. భార్య భర్తలకు మధ్య గొడవలు రావడంతో భర్తను వదిలేసిన ఆమె.. ఆటోడ్రైవర్‌తో కలిసి ఉంటోందని పోలీసులు చెప్పారు. అతనే హత్య చేసి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానస్పదస్థితిలో మహిళ మృతి