అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వివాహిత రాజేశ్వరీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 29న మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు భర్త ఈశ్వర్ తెలిపాడు. ముళ్లపొదల్లో మృతి చెందిన ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పంచనామా నిమిత్తం మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - కర్నూలు జిల్లా తాజా వార్తలు
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 29న ఈమె మిస్సైందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వివాహిత రాజేశ్వరి ముళ్లపొదలో శవమై కనిపించటం అనుమానాలకు తావిస్తోంది.
women suspected died in anantapur dst