కట్నం కోసం భర్త వేధింపులు... వివాహిత ఆత్మహత్య! - dowry harassment
అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది. వరకట్న వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం జిల్లా గుంతకల్లులో వరకట్న వేధింపులకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిలక్‌నగర్‌లో నివాసముంటున్న జాస్మిన్‌కు నాలుగేళ్ల క్రితం ఖాదర్ వలితో వివాహమైంది. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. జాస్మిన్ భర్త, అత్త బీబీలు కలిసి అదనపు కట్నం కోసం వేధించేవారని మృతురాలి బంధువులు తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేక తమ కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లి ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని... పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.