అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి.. తమ పొలానికి వెళ్లే దారిలో తన మరిది సంజీవరెడ్డి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యను పరిష్కరించకుండా.. పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలి కుమారుడు తెలిపాడు. పోలీసుల వేధింపులు తాళలేక తన తల్లి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
SUICIDE ATTEMPT: మహిళ ఆత్మహత్యాయత్నం..పోలీసుల వేధింపులేనా..! - crime news in ananthapuram
పొలం విషయంలో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే.. తమనే వేధిస్తున్నారని ఓ మహిళా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల వేధింపులు తాళలేక తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసిందని కుమారుడు ఆరోపించిన ఘటన అనంతపురం జిల్లా కొట్టాలపల్లిలో జరిగింది.
మహిళ ఆత్మహత్యాయత్నం