ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాప్తాడులో మద్యం దుకాణం తొలగించాలని మహిళల నిరసన - గ్రామంలో రాప్తాడులో మహిళల నిరసన

అనంతపురం జిల్లా రాప్తాడులో మహిళలు నిరసనకు దిగారు. తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన చేపట్టారు. వేరే గ్రామాల వారు ఇక్కడకు వచ్చి కరోనా వ్యాప్తి చేస్తున్నారని... తక్షణమే మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేశారు.

Women protest to remove liquor store in raptadu village at ananthapur
రాప్తాడులో మద్యం దుకాణం తొలగించాలని మహిళల నిరసన

By

Published : Jul 5, 2020, 2:19 PM IST

Updated : Jul 5, 2020, 3:52 PM IST

తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ అనంతపురం జిల్లా రాప్తాడులో మహిళలు నిరసనకు దిగారు. అనంతపురం నగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా మద్యం దుకాణాలను తెరవలేదు. దీంతో మందుబాబులు అనంతపురం నగరం పక్కనే ఉన్న రాప్తాడుకు వెళ్తున్నారు. అక్కడున్న మద్యం దుకాణం వద్ద రోజు వందలాది మంది క్యూలైన్లలో నిల్చుని కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఆ పరిసరాల్లోనే తిరుగుతున్నారు.

కరోనా విజృంభిస్తుండటంతో... ఎక్కడినుంచో వచ్చినవారు తమ గ్రామానికి వచ్చి వైరస్ వ్యాప్తి చేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. ఇళ్ల మధ్యనే ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళలు, పిల్లల పరిస్థితి ఏంటని నిలదీశారు. మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మహిళలతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మద్యం దుకాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళనను విరమించారు.

ఇదీ చదవండి:

'స్వార్థ రాజకీయాల కోసం మూడు ముక్కలు చేస్తున్నారు'

Last Updated : Jul 5, 2020, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details