కొత్త మద్యం విధానంలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ మహిళలు ఒక్కటయ్యారు. అధికారుల వద్దకు చేరుకుని తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని కోరారు. వారు పట్టించుకోనందున శుక్రవారం మద్యం షాపుకు తాళాలు వేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న తమ గ్రామంలో బెల్టు దుకాణం ఏర్పాటు వల్ల సమస్యలు వస్తాయని నిరసనకు దిగారు. దయచేసి షాపు తీసేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దుకాణం అలాగే ఉంచితే తాము ఒప్పుకోమని, దీనిపై ఎంత వరకైనా ఉద్యమం చేపడతామని మహిళలు హెచ్చరించారు. ఈ విషయంపై ఉరవకొండ ఎస్సై కి వినతి పత్రం సమర్పించారు.
'మా గ్రామంలో మద్యం దుకాణాలు వద్దంటే వద్దు' - women protest near wine shops in amidyala
ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. మద్యంతో తమ కుటుంబాలు నాశనం అవుతున్నాయని నిరసనకు దిగారు. అనంతరం ఉరవకొండ..కళ్యాణదుర్గం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.

'మా గ్రామంలో మద్యం దుకాణాలు వద్దంటే వద్దు'
TAGGED:
గ్రామ మహిళలు ఆందోళన