ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళా చట్టాలను కఠినతరం చేయాలి'

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

Women protest
Women protest

By

Published : Aug 28, 2020, 3:46 PM IST

మహిళలపై దాడులు పెరుగుతున్నాయని.. నిందితులను కఠినంగా శిక్షించాలని.. మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద ఐక్య మహిళా సంఘాల నాయకురాళ్లు ధర్నా నిర్వహించారు. మహిళలపై దాడులు జరిగితే నిందితులను శిక్షించడానికి చట్టాలు ఉన్నా.. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు.

లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను కఠినతరం చేయకుంటే.. తాము ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details