ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతలు నా ఇంటి స్థలాన్ని ఆక్రమించారు.. అధికారులూ కాపాడండి' - ycp land issue in anantapur dst

వైకాపా నాయకులు అన్యాయంగా తన ఇంటి స్థలం ఆక్రమించారని ఓ వివాహిత అనంతపురం జిల్లా గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్వోను వేడుకుంది.

women protest in anantapur dst guntkala mro offcie about her land issue
women protest in anantapur dst guntkala mro offcie about her land issue

By

Published : Jun 16, 2020, 6:23 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలగొండ గ్రామనికి చెందిన ఉమాదేవి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తన ఇంటి స్థలం కోసం నిరసనకు దిగింది.

ఆమె ఏం అంటున్నారంటే...

"వైకాపా నేతలు నా ఇంటి ముందు బండలు అడ్డంగా పాతి నన్ను,నా భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాకు మా గ్రామ వైకాపా నాయకుల నుంచి ప్రాణహాని ఉంది. ఎలాగైనా న్యాయం చేయండి సారూ. గతంలో నాకు తహసిల్దార్ గారు పట్టా ఇచ్చారు. ఎంపీడీఓ గారు కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారండీ. నేను ఇల్లు కట్టుకుని ఉన్నా. కానీ.. 8 నెలల నుంచి ఇంటి పక్కన ఉన్న వైకాపా నేతలు కొంత మంది ఆ స్థలం తమదని బండలు పాతి మాతో గొడవలకు దిగుతున్నారు. జిల్లా పోలీసులకు,కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని అర్జీలు పెట్టినా...సమస్య పరిష్కరిస్తాం అని చెప్తున్నారే కానీ బండల్ని తొలగించటం లేదు."

స్పందించిన తహసీల్దార్

ఉమాదేవి సమస్యపై.. స్థానిక తహసీల్దార్ స్పందించారు. వారం రోజుల్లో పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వగా.. ఆమె నిరసన విరమించారు.

ఇదీ చూడండి:

రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details