తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - womans protest for water at mpdo office news update
తాగునీటి కోసం అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో రొద్దం - పావుగడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని పలువురు అధికార పార్టీ నాయకులు నివాస గృహాలకు కుళాయిలు అమర్చుకోవడం వల్ల తమకు నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ట్రాక్టర్‌పై ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు.