అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని మిడుతూరు సమీపంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను హత్య చేసి దహనం చేశారు. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన గల అమోఘ్ ఫ్యామిలీ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెస్టారెంట్ నిర్వహకులు పెద్దవడుగూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ..వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు . క్లూస్ టీం ఆధారంగా వివరాలను సేకరించి ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మిడుతూరు సమీపంలో ఓ మహిళ హత్య - మిడుతూరు సమీపంలో ఓ మహిళ హత్య
గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను హత్య చేసి దహనం చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని మిడుతూరులో జరిగింది.
![మిడుతూరు సమీపంలో ఓ మహిళ హత్య women killed at miduthuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8581747-737-8581747-1598545282007.jpg)
మిడుతూరు సమీపంలో ఓ మహిళ హత్య