ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం - child birth in ambulance at ananthapur

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో మహిళ 108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చింది. నాయన వారి పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి పురిటి నొప్పులు ఎక్కువ కావటంతో.. అంబులెన్స్ సిబ్బంది వాహనంలో పురుడు పోశారు.

women gave birth to child in ambulance at garlapenta mandal
108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

By

Published : Oct 30, 2020, 11:20 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో ఓ మహిళ 108 వాహనంలోనే ప్రసవించింది. నాయన వారి పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. 108 వాహనం సిబ్బంది ఆమెను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలిస్తుండగా పురిటి నొప్పుల తీవ్రత మరింత పెరిగింది. ఈ పరిస్థితిని గుర్తించిన 108 సిబ్బంది వాహనంలోనే మహేశ్వరికి పురుడు పోశారు. మహేశ్వరి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. వైద్య సహాయం కోసం మహేశ్వరిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details