కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ 'ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్'లో పనిచేసే మహిళా కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా పరిగిలోని ఆ సంస్థ గేటు ముందు సీపీఎం ఆధ్వర్యంలో బైఠాయించి.. బోనస్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరు కాబోమని కార్మికులు ప్రకటించారు. ఈ పరిణామంతో పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది.
కనీస వేతనాల కోసం మహిళా కార్మికుల నిరసన - అనంతపురంలోని ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ వద్ద మహిళల నిరసన
పనికి తగిన విధంగా వేతనాలు ఇవ్వడం లేదంటూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళా కార్మికులు నిరసనకు దిగారు. అనంతపురం జిల్లా పరిగిలోని 'ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్' గేటు ముందు బైఠాయించారు. బోనస్లు ప్రకటించే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు.
![కనీస వేతనాల కోసం మహిళా కార్మికుల నిరసన women workers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9511678-978-9511678-1605092014127.jpg)
ధర్నా చేస్తున్న మహిళా కార్మికులు
ఇతర సంస్థల్లో మహిళా కార్మికులకు పని ఆధారంగా రూ. 15,000 జీతం ఇస్తుండగా.. ఇక్కడ రూ. 6,000 తోనే సరిపెడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. వేతనాలతో పాటు బోనస్ ప్రకటించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి'
TAGGED:
cpm protests in anantapuram