ప్రమాదవశాత్తు విద్యుతాఘాతానికి(ELECTRIC SHOCK) గురై ఓ మహిళ మృతి చెందింది. ఆమె పొట్టకూటికోసం కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తనకల్లు మండల చీకటిమానుపల్లి సమీపంలోని దానిమ్మతోటలో కూలి పనుల కోసం వెళ్లిన గౌరమ్మ వెళ్లింది.
తోటలో పనులు చేస్తున్న సమయంలో అక్కడి విద్యుత్ తీగలను గుర్తించక పొరపాటున తాకింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గౌరమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న తనకల్లు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.