అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వజ్రకరూర్ మండలం బోడసానిపల్లి గ్రామానికి చెందిన వర్లీ భాయి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త కేశవ నాయక్తో పాటు ఆరు నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... ఇద్దరికి గాయాలు - అనంతపురంలో రోడ్డు ప్రమాదం వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో పగటిపూట రోడ్డుపై వాహనాలను అనుమతించకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అదే వారికి ఆఖరి ప్రయాణం అయ్యింది. ఆరు నెలల చిన్నారికి తల్లి లేకుండా పోయింది. రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి తల్లి మృతి చెందగా... తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
![రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... ఇద్దరికి గాయాలు women died and two people are injured in a road accident at ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6953988-228-6953988-1587922754211.jpg)
women died and two people are injured in a road accident at ananthapuram