ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెట్టినింటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య..!

పెళ్లి... ప్రతి ఆడపిల్ల జీవితంలో మార్పులకు నాంది. అప్పటివరకూ తల్లిదండ్రుల దగ్గర గారాలు పోయిన అమ్మాయి వివాహం తరువాత ఎన్నో బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి బంధానికి కొంతమంది భయపడితే.. మరికొంత మంది ఆనందంగా ఆహ్వానిస్తారు. అది సహజమే కానీ.. కాబోయే ఓ వధువు పుట్టింటిని వదల్లేక బలవన్మరణానికి పాల్పడింది.

మెట్టినింటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య..!
మెట్టినింటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య..!

By

Published : Nov 15, 2020, 2:49 PM IST

Updated : Nov 15, 2020, 6:57 PM IST

పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రామ్​నగర్​కు చెందిన రంగనాయకమ్మ(25) ఫ్యాన్​కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో... వివాహం జరగాల్సిన ఇంట తీరని విషాదం అలుముకుంది.

అసలేం జరిగింది..

రంగనాయకమ్మకు పట్టణంలోని శివనగర్​కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. పాతికేళ్లుగా పుట్టి పెరిగిన ఇంటిని వదిలి మెట్టినింటికి వెళ్లలేనని బాధపడుతుండేదని బంధువులు పేర్కొన్నారు. కుటుంబసభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో యువతి ఆత్మహత్య చేసుకుంది. కొత్త జీవితం ప్రారంభించాల్సిన కుమార్తె అనంతలోకాలకు వెళ్లటంతో యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

బట్టలు కొనివ్వలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక

Last Updated : Nov 15, 2020, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details