మూడు నెలలుగా తాగునీరు రాక ఇబ్బంది పడుతున్నామని.. అనంతపురంలో మహిళలు వార్డు సచివాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. సకల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు.
'తాగునీటి సమస్య పరిష్కరించకపోతే.. జరగబోయేది అదే..' - అనంతపురం జిల్లాలో తాగు నీటి సమస్యలు
తాగునీటి కోసం అనంతపురంలో మహిళలు.. వార్డు సచివాలయాన్ని ముట్టడించారు. తాగు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
!['తాగునీటి సమస్య పరిష్కరించకపోతే.. జరగబోయేది అదే..' మహిళల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15318945-415-15318945-1652870319840.jpg)
గత మూడు నెలలుగా నిత్యం నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు సైతం సరిగా లేవని సకల సమస్యలతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. తాగునీటికోసం కుళాయిలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఎన్నికల ముందు మొక్కుతూ వచ్చే రాజకీయ నాయకులు.. ప్రజలకు సమస్యలు వస్తే కనబడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై నిత్యం సచివాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదన్నారు. చేసేదేమి లేకే సచివాలయ ముట్టడి చేపట్టామన్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే త్వరలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: