అనంతపురం జిల్లా(ananthapuram district) హిందూపురం పట్టణానికి చెందిన లక్ష్మీదేవి, వెంకటేశులు దంపతుల కుమార్తె పల్లవికి పామిడి గ్రామానికి చెందిన మల్లికార్జునతో ఆగస్టు 27న వివాహ(marriage)మైంది. పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం మెట్టింటి వారు పల్లవిని వేధింపులకు గురి చేసే వారని పల్లవి తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో అదనపు కట్నం తీసుకురావాలని తమ కూతురిని మూడు రోజుల క్రితం హిందూపురం పంపించారని వెల్లడించారు. వారి వేధింపులు తాళలేక పల్లవి ఉరివేసుకొని ఆత్మహత్య(suicide with hang) చేసుకుందని వివరించారు. ఈ ఘటనపై పల్లవి తల్లిదండ్రుల ఫిర్యాదు(complaint)తో పోలీసులు కేసు నమోదు(case file) చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని(dead body) ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
SUICIDE : పెళ్లయిన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య... కారణమేంటంటే... - crime news in ananthapuram district
పెళ్లయిన 40 రోజులకే ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం(dowry) కోసం అత్తింటి వారి వేధింపులు(harassment) భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం(hindupuram)లో జరిగింది.
వివాహిత ఆత్మహత్య