Woman Gave Birth to 5.2 Kg Baby Boy: అనంతపురం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. ఈమెకు గతంలో కూడా ఎక్కువ బరువున్న శిశువులే పుట్టారు. ఈ సారి గత రెండు కాన్పుల కంటే ఎక్కువ బరువున్న శిశువు జన్మించాడు.
సాధారణంగా పుట్టిన వెంటనే పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల వరకు బరువు ఉంటారు. 3 - 3.5 కిలోలను సగటు బరువుగా చెబుతుంటారు. కానీ అనంతపురం జిల్లాలో 5.2 కిలోల బరువున్న శిశువు జన్మించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన వైద్యులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన షాబానాఖానమ్ 5.2 కేజీల బరువుతో శిశువు జన్మించాడని పేర్కొన్నారు.
Strange incident: భార్య నల్లపూసల గొలుసు మింగేసిన భర్త.. ఆపరేషన్ చేయకుండానే వైద్యం
షాబానాఖానమ్.. భర్త ఆయుబ్తో కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. షాబానా గత నెల 30వ తేదీన ఆసుపత్రిలో చేరింది. స్కానింగ్‌లో శిశువు బరువు ఎక్కువగా ఉండటంతోపాటు ఉమ్మనీరు అధికంగా ఉన్నట్లు గుర్తించి, రిస్క్ ఎక్కువగా ఉన్నందుకు తెలిపారు. దీంతో చేరిన రోజునే సిజేరియన్ చేసి శిశువును బయటకు తీసినట్లు తెలిపారు. మామూలుగా 5 సెంటీమీటర్ల స్థాయిలో ఉండే ఉమ్మనీరు ఏకంగా 28 సెంటీమీటర్లు ఉంది. బాగా హైరిస్క్ కేసు కావడంతో వెంటనే చేర్చుకుని వైద్య పరీక్షలు చేశామన్నారు.