ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

108 అంబులెన్స్​లో మహిళ ప్రసవం - Woman giving birth in an ambulance news

అనంతపురం జిల్లాలో 108 అంబులెన్స్​లో మహిళ ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తి.. తల్లీ, బిడ్డ ప్రాణాలు కాపాడింది.

Woman gave birth in an ambulance
Woman gave birth in an ambulance

By

Published : Oct 3, 2020, 11:13 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి చెందిన సువర్ణ అనే గర్భిణికి శనివారం పురిటి నొప్పులు రావటంతో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెను హిందూపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం సువర్ణను 108 అంబులెన్స్​లో హిందూపురం తీసుకెళ్తుండగా బుల్లసముద్రం గ్రామం వద్ద పురిటి నొప్పులు అధికమయ్యాయి.

ఈ క్రమంలో అంబులెన్స్లో ఉన్న ఈ.ఎమ్.టి. చిత్తయ్య మహిళకు ప్రసవం చేశారు. అనంతరం మడకశిరకు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. 108 సిబ్బందిని అభినందించారు. సువర్ణ కుటుంబసభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details