ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాము కాటుకు గురై మహిళ మృతి - పాము కాటుకు మహిళ మృతి వార్తలు

పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి పెద్ద తండాలో జరిగింది.

Woman died
మరణించిన మహిళ

By

Published : Jun 11, 2021, 7:11 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి పెద్ద తండా గ్రామంలో పాటు కాటుకు ఓ మహిళ బలైంది. సాగు పనులు చేసేందుకు పొలానికి వెళ్లిన రామక్క అనే మహిళను పాము కాటేసింది. భయంతో ఆమె గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ సర్పాన్ని హతమార్చారు. రామక్కను చికిత్స కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details