ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంకటివారిపల్లిలో గోడ కూలి మహిళ మృతి - గోడ కూలి మహిళ మృతి తాజా వార్తలు

అనంతపురం జిల్లా సంకటివారిపల్లిలో గోడ కూలి మహిళ మృతి చెందింది. సంకటివారిపల్లిలో పాపులమ్మ అనే మహిళ పాత మైరాడ వద్ద పాడుబడిన గోడ రాళ్లను తెచ్చుకునేందుకు వెళ్లగా గోడ కూలి మీద పడింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

woman dead in wall collapsed
గోడ కూలి మహిళ మృతి

By

Published : Jun 28, 2020, 11:26 AM IST

ఇంటి నిర్మాణానికి అవసరమైన రాళ్ల కోసం వెళ్లిన ఓ మహిళ గోడకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. తలుపుల మండలం సంకటివారిపల్లిలో పాపులమ్మ అనే మహిళ పాత మైరాడ వద్ద పాడుబడిన గోడ రాళ్లను తెచ్చుకునేందుకు వెళ్లింది. రాళ్లు తీసుకునే సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని పాపులమ్మను బయటకు తీశారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details