అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లులో విషాదం చోటు చేసుకుంది. మిరప పంట తొలగించేందుకు కర్ణాటక నుంచి వచ్చిన వ్యవసాయ కూలి పిడుగు పాటుకు గురై మృతి చెందింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా యాల్పి గ్రామానికి చెందిన సుంకమ్మ (48) మరో 10 మంది కూలీలతో కలిసి మిరపకోత పనులకు నింబగల్లు గ్రామానికి వచ్చింది. వీరంతా పొలంలో పనిచేస్తున్న సమయంలో.. కురిసిన వర్షానికి పిడుగు పడింది. సుంకమ్మ అనే మహిళ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కుటుంబానికి అండగా ఉన్న పెద్ద దిక్కు మృతి చెందటంతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అనంతలో పిడుగుపాటుకు.. కర్ణాటకవాసి మృతి - అనంతపురం జిల్లాలో పిడుగుపాటు వార్తలు
కర్ణాటక నుంచి వచ్చిన వ్యవసాయ కూలి పిడుగు పాటుకు గురై మృతి.. చెందిన ఘటన అనంతపురం జిల్లా నింబగల్లులో చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా యాల్పి గ్రామానికి చెందిన సుంకమ్మ మిరపకోత పనులు నిమిత్తం.. జిల్లాకు వచ్చారు. ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు ఆమె మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
woman dead