అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వైకాపా మద్దతుదారు మంజుల పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 2న ఆమె సర్పంచి స్థానానికి నామినేషన్ వేశారు. కానీ స్థానిక వైకాపా నేతలు మరో మహిళతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. దాంతో మొదట నామినేషన్ వేసిన మంజుల మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం ఆమెను అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వైకాపా మద్దతు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం - అనంతపురం జిల్లా కనగానపల్లి వార్తలు
సర్పంచి అభ్యర్థిత్వానికి వైకాపా మద్దతు ఇవ్వలేదని కనగానపల్లి మండలం శివపురంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
మహిళ ఆత్మహత్యాయత్నం