Gadapa Gadapa Program in Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండా గ్రామంలో నిర్వహించిన 'గడప గడపకూ..'కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి చుక్కెదురైంది. కేవలం ఓట్ల కోసం మాత్రమే 'అమ్మా.. అయ్యా.. అంటూ వస్తారా.. సమస్యలు పట్టించుకోరా..' అంటూ ఓ మహిళ ప్రశ్నించింది. ఆమె భర్త పింఛన్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఓట్ల కోసమే వస్తారా.. సమస్యలు పట్టించుకోరా... వైకాపా నేతను నిలదీసిన మహిళ - Gadapa Gadapa Program in Uravakonda
వైకాపా ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకూ..' కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా నిలదీతలే ఎదురవుతున్నాయి. ఏ నాయకుడు.. ఏ గ్రామానికి, ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ప్రశ్నలతో తీవ్ర తిరస్కారాన్ని తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరంలో కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఓ మహిళ నిలదీసింది.

former MLA Visweswara Reddy
ఓట్ల కోసమే వస్తారా.. సమస్యలు పట్టించుకోరా... వైకాపా నేతను నిలదీసిన మహిళ
Last Updated : May 31, 2022, 7:03 PM IST