అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మాస్కు లేకుండా బయట తిరిగే వారికి భారీ జరిమానాలు వేస్తున్నారు మున్సిపల్ అధికారులు. పట్టణంలో వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిందని, అయినా ప్రజలు పట్టించుకోని తీరును గుర్తించే.. కఠిన చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.
మాస్కు లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి రూ. 100 వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రజలకు కొత్త మస్కులు ఇచ్చి కరోనా నిబంధనలు తెలియచేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. దుకాణాలు, కల్యాణ మండపాలు, రద్దీ ప్రాంతాల్లో విధిగా మాస్కు ధరించాలన్నారు. లేని పక్షంలో మరింతగా జరిమానాలు వేస్తామని హెచ్చరించారు.