అనంతపురం నగరంలోని 25వ డివిజన్లో తన ఓటు ఎవరో వేశారని ఓ విద్యావంతుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తాను అన్ని ఆధారాలతో గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రంలోనికి వెళ్లగా తన ఓటు వేశారని పోలింగ్ సిబ్బంది సమాధానం చెప్పారని శ్రీనివాసులు అనే ఓటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఓటును ఎవరో దొంగ ఓటుగా వేశారని మీడియా ముందు చెబుతుండగా.. వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ వచ్చి మీడియాతో మాట్లాడనీయకుండా నీ ఓటు నేను వేయిస్తా రా అంటూ తీసుకెళ్లాడు. అనంతరం అతనితో ఓటు వేయించకపోగా తన అనుచరుల దగ్గరకు తీసుకెళ్ళి అటునుంచి అటే పంపించినట్లు సమాచారం.
తన ఓటును వేరొకరు వేయటంతో ఓటరు ఆందోళన - Anantapur District Municipal Election Polling News
ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం కొంతమంది దొంగ ఓట్లను వేస్తున్నారు. దీంతో ఇతరులు తమ ఓటు వేసుకునే అవకాశం కోల్పోతున్నారు. ఇలాగే తన ఓటును ఎవరో వేశారని ఓ విద్యావంతుడు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన అనంతపురం 25వ డివిజన్లో జరిగింది.
తన ఓటును వేరొకరు వేయటంతో ... ఓటర్ ఆందోళన