అనంతపురం జిల్లాలో వీచిన ఈదురుగాలులు వ్యాపారులకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. కళ్యాణదుర్గంలో రాత్రి వీచిన ఈదురు గాలులకు పట్టణ శివార్లలో మామిడి, టమాట మండీల కోసం వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న షెడ్లు నేలమట్టమయ్యాయి. కొన్ని షెడ్ల పైకప్పులు వందల అడుగుల దూరం లేచిపోయాయి. కోళ్ల ఫారాల షెడ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.
కళ్యాణదుర్గంలో ఈదురుగాలులు.. కూలిన షెడ్లు - అనంతపురం వార్తలు
అనంతపురం జిల్లాలో ఈదురుగాలులకు భారీ నష్టం వాటిల్లింది. కళ్యాణదుర్గంలో మామడి, టమాట మండీల కోసం వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న షెడ్లు నేలమట్టమయ్యాయి.
![కళ్యాణదుర్గంలో ఈదురుగాలులు.. కూలిన షెడ్లు కళ్యాణదుర్గంలో ఈదురుగాలులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11741549-306-11741549-1620880809837.jpg)
కళ్యాణదుర్గంలో ఈదురుగాలులు