అనంతపురం జిల్లా కంబదూరు మండలం మరిమాకులపల్లి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ శివార్లలో గోవిందమ్మ అనే మహిళ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్టు స్థానికులు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. సదరు మహిళ భర్త.. సమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ భర్తకూడా మృతిచెందాడు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి త్వరలోనే ఘటనకు కారణాలు వెలికితీస్తామని కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివ శంకర్ నాయక్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో దంపతుల బలవన్మరణం - wife suicide in anantapur dst husbend committe to suicide
భార్య చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది. భర్త పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య శరీరంపై గాయలెందుకున్నాయి? అసలు ఈ దంపతులకు ఏమైంది? భార్యను ఎవరైనా చంపేసి.. చెట్టుకు వేలాడదీశారా? అనంతపురం జిల్లా కంబదూరు మండలం మరిమాకుపల్లిలో కలకలం సృష్టించిన ఈ ఘటన వెనక వాస్తవాలేంటి?
అనంతపురం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
TAGGED:
crime news in anantapur dst