అనుమానంతో భార్య భర్తను హత్యచేసిన ఘటన అనంతపురం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు.. మల్లేశ్వరిరోడ్డుకు చెందిన హర్షవర్దన్‌రావు(35) నగరంలోని మారుతినగర్‌కు చెందిన గంగాదేవిని కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. హర్షవర్దన్ నర్సరీ సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పైపులను బిగించే రించుతో భార్య భర్త తలపై దాడి చేసింది.
తీవ్రంగా గాయపడిన భర్త రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. భార్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికులు 100కు ఫోన్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్షవర్దన్ మృతిచెందాడు. ఇతనికి మరో మహిళతో పరిచయం ఉండటంతో భార్య అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యకు దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది. రెండో పట్టణ సీఐ జాకీర్‌హుసేన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా అనుమానంతో దగ్గరకు రాని స్థానికులు