భర్త వేధింపులు భరించలేక.. భార్య హత్య చేసిన సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. నగరంలోని అశోక్ నగర్ కు చెందిన రాజేంద్ర ప్రసాద్(51), కుసుమ(34) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అనుమానంతో నిత్యం భర్త వేధింపులకు గురిచేయడంతో ఆమె సహనం కోల్పోయింది. రోకలి బండతో భర్తను చంపి.. పోలీసులకు ఫోన్ చేసి తానే సమాచారం ఇచ్చింది. చిత్రహింసలు భరించలేక ఇలా చేసినట్లు పోలీసులకు తెలిపింది. ఆమెను అదుపులోకి తీసుకున్న ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
KILLED: వేధిస్తున్న భర్తను హత్య చేసిన భార్య.. ఆపై - crime news
భర్త వేధింపులు భరించలేక.. అతడిని హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పైగా తానే హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అంధించింది.
KILLED